Abn logo
Jun 2 2020 @ 11:33AM

మిస్కిన్‌ దర్శకత్వంలో శింబు

ప్రముఖ దర్శకుడు మిస్కిన్‌ రూపొందించనున్న చిత్రంలో యువనటుడు శింబు నటించనున్నారు. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో ‘మానాడు’ అనే చిత్రంలో శింబు నటించారు. హైదరాబాద్‌లో ఆ సినిమా షూటింగ్‌ జరుగుతుండగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ఆ షూటింగ్‌ ఆగిపోయింది. ఈ గ్యాప్‌లో మిస్కిన్‌ చెప్పిన కథ నచ్చటంతో శింబు ఆయన దర్శకత్వంలో నటించేందుకు సమ్మతించారు. ఈ చిత్రంలో చాలా గ్యాప్‌ తర్వాత హాస్యనటుడు వడివేల్‌ ఓ పోలీసు పాత్ర పోషించనున్నారు.

Advertisement
Advertisement
Advertisement