Abn logo
Jun 8 2021 @ 06:59AM

సిమ్‌ కార్డు కేవైసీ పేరుతో లక్షా 15 వేలు స్వాహా..

హైదరాబాద్ సిటీ/హిమాయత్‌నగర్‌ : సిమ్‌ కార్డు కేవైసీ అప్‌డేట్‌ పేరుతో మాదన్నపేట్‌కు చెందిన యువకుడిని ట్రాప్‌ చేసిన సైబర్‌ కేటుగాళ్లు లక్షకు పైగా కాజేశారు. సైబర్‌ క్రైం ఏసీపీ కేవీఎమ్‌ ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం మాదన్నపేట్‌కు చెందిన మహమ్మద్‌ ఉమర్‌కు సోమవారం ఉదయం ఒక ఫోన్‌కాల్‌ వచ్చింది.  రిలయన్స్‌ జియో నుంచి కాల్‌ చేస్తున్నాని, మీ సిమ్‌కార్డు గడువు ముగిసిందని, కేవైసీ అప్‌డేట్‌ చేసి చార్జీలు చెల్లించాలని, డెబిట్‌ కార్డు వివరాలు చెబితే ఆన్‌లైన్‌లో చార్జీలు చెల్లించి అప్‌డేట్‌ చేస్తా అని చెప్పాడు. అతడి మాటలు నమ్మిన ఉమర్‌ తన  కార్డు వివరాలు సహా మొబైల్‌కు వచ్చిన ఓటీపీ నంబర్‌ కూడా చెప్పాడు. కొన్ని క్షణాల్లోనే రూ.లక్షా 15వేలు బ్యాంకు ఖాతాలో డెబిట్‌ అయినట్లు మొబైల్‌కు మెసేజ్‌ వచ్చింది. దీంతో అతను తనకు వచ్చిన కాల్‌ నెంబర్‌కు తిరిగి చేయగా స్విచ్‌ ఆఫ్‌ వచ్చింది. మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్‌ క్రైంలో ఫిర్యాదు చేశాడు.