Abn logo
May 23 2020 @ 21:34PM

సిక్కింలో తొలి కోవిడ్-19 పాజిటివ్ కేసు

న్యూఢిల్లీ : సిక్కింలో తొలి కోవిడ్-19 పాజిటివ్ కేసు నమోదైందని డీజీ-కమ్-హెల్త్ సెక్రటరీ డాక్టర్ పీటీ భూటియా శనివారం చెప్పారు. దక్షిణ సిక్కింకు చెందిన 25 ఏళ్ళ యువకునికి కోవిడ్-19 పాజిటివ్ అని నిర్థరణ అయినట్లు తెలిపారు. 


ఈ యువకుడు ఈ నెల 17న న్యూఢిల్లీ నుంచి సిలిగురి వరకు ఓ ప్రైవేటు బస్సులో ప్రయాణించినట్లు భూటియా ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు. ఈ నెల 19న సిలిగురి నుంచి ఎస్ఎన్‌టీ బస్సులో ప్రయాణించినట్లు తెలిపారు. ఆ వ్యక్తిని దక్షిణ జిల్లాలోని క్వారంటైన్ సెంటర్‌లో ఉంచినట్లు తెలిపారు. 


ఈ నెల 21న ఆ వ్యక్తికి జ్వరం వచ్చిందని, ఈ నెల 22న ఉదయం ఆయనను ఎస్‌టీఎన్ఎం ఆసుపత్రికి తరలించామని చెప్పారు. ఈ ఆసుపత్రిలోని ట్రూనాట్ మిషన్‌తో పరీక్షించినపుడు ఆ వ్యక్తికి కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్థరణ అయిందన్నారు. 


ఆయన శాంపిల్స్‌ను మరోసారి పరీక్షించేందుకు సిలిగురిలోని నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు పంపించినట్లు చెప్పారు. శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు పరీక్ష ఫలితాల నివేదిక వచ్చిందన్నారు. ఆ వ్యక్తి కోవిడ్-19 పాజిటివ్ అని నిర్థరణ అయిందని తెలిపారు. ఆయనను ఐసొలేషన్ వార్డుకు తరలించినట్లు చెప్పారు.


Advertisement
Advertisement
Advertisement