Abn logo
Oct 23 2020 @ 05:02AM

రుణాల రికవరీపై దృష్టి సారించాలి

పలాసరూరల్‌ : రుణాల రికవరీపై ప్రత్యేక దృష్టి సారించాలని వెలుగు ఏసీవో సిద్ధనాగులు తెలిపారు. స్థానిక స్త్రీనిధి భవనంలో గురువారం వివిధ రకాల రుణాల రికవరీపై ఆరు మండలాల సీసీ, ఏపీఎంలకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఐఎఫ్‌, స్త్రీనిధి, వాటర్‌షెడ్‌, ఐసీడీపీ, ఎస్‌జీఎస్‌వై నిధులు వీవోలు, ఎస్‌హెచ్‌జీలకు ఎంత మేర వచ్చింది వాటిని పరిశీలించాల న్నారు. జగనన్నతోడు, వైఎస్‌ఆర్‌ బీమా ఖాతాల ప్రారం భంలో, స్త్రీనిధి రుణాల పంపిణీ అంశాలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. శిక్షణలో ఏపీఎంలు కె.జాంభవతి, జి.ప్రసాదరావు, బి.మల్లేశ్వరరావు, సీసీలు జి.అప్పలనర్మ, కె.రాము, కె.సునీత, డి.రాజేశ్వరి పాల్గొన్నారు. 

Advertisement
Advertisement