Abn logo
Jul 15 2020 @ 03:41AM

వీఆర్‌కు ముప్పాళ్ళ ఎస్‌ఐ జగదీష్‌

 పెళ్ళి చేసుకుంటానని మోసం చేశాడంటూ మహిళ ఫిర్యాదు 

కొనసాగుతున్న దర్యాప్తు


గుంటూరు, జూలై 13: ముప్పాళ్ళ ఎస్‌ఐ జగదీష్‌ను వీఆర్‌కు పంపుతూ రూరల్‌ ఎస్పీ విశాల్‌ గున్ని మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల నరసరావుపేట రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రావిపాడు గ్రామానికి చెందిన ఓ మహిళ ఎస్‌ఐ జగదీష్‌ పెళ్ళి చేసు కుంటానని మోసం చేశాడని ఫిర్యాదు చేయగా పోలీసులు ఎస్‌ఐ జగదీష్‌పై కేసు నమోదు చేశారు. రూరల్‌ ఎస్పీ విశాల్‌ గున్నిని కలసి తనవద్ద ఉన్న ఆధారాలను అందించారు. తాను డీఎన్‌ఏ పరీక్షకు కూడా సిద్ధమేనని స్పష్టం చేశారు. దీంతో పోలీసులు ఈ కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు. దర్యాప్తులో భాగంగా ఎస్‌ఐ జగదీష్‌పై వచ్చిన ఆరోపణలను దృష్టిలో ఉంచుకొని ఆయనను వీఆర్‌కు పంపారు. 

Advertisement
Advertisement
Advertisement