Abn logo
Apr 3 2020 @ 04:29AM

మళ్లీ దొరకదేమో!

 సుదీర్ఘ విరామంపై సింధు

 ఆలస్యంగా నిద్రలేస్తున్నా

 సినిమాలు చూస్తూ కాలక్షేపం

హైదరాబాద్‌: జీవితంలో ఇంతటి సుదీర్ఘ విరామం మళ్లీ రాదేమోనని ఏస్‌ షట్లర్‌ పీవీ సింధు అభిప్రాయపడింది. బ్యాడ్మింటన్‌ కెరీర్‌ ప్రారంభమయ్యాక తాను ఇన్నిరోజులు ఇంటిపట్టునే ఉండడం ఇదే తొలిసారని చెప్పింది. గత నెల 11 నుంచి 15 వరకు బర్మింగ్‌హామ్‌లో జరిగిన ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌పలో పాల్గొని స్వదేశానికి వచ్చిన సింధు..కరోనా వైరస్‌ నేపథ్యంలో 14 రోజులపాటు స్వీయ నిర్బంధంలోకి వెళ్లింది. అది పూర్తవగా..దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో మరికొన్ని రోజులు ఆమె ఇంటికే పరిమితమవ్వాల్సి వ స్తోంది. ఈ విరామాన్ని ఎలా ఎంజాయ్‌ చేస్తోందో ఆమె వివరించింది. 


వుహాన్‌ వెళ్లేవాళ్లం..

టోక్యో ఒలింపిక్స్‌ యధాప్రకారం జరుగుతాయని మొన్నా మధ్యవరకూ తామంతా భావించామని, సాధారణ పరిస్థితులు  ఉండివుంటే ఈపాటికి క్వాలిఫయింగ్‌ టోర్నమెంట్లలో పా ల్గొంటుండడం ద్వారా విశ్వ క్రీడలకు సన్నద్ధమవుతూ ఉండేవారమని వివరించింది. ఇంకా చెప్పాలంటే..ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌పకోసం కరోనా కేంద్ర బిందువు వుహాన్‌ కూడా వెళ్లేవారమని తెలిపింది.

 

జీవితమే ముఖ్యం..

ఒలింపిక్స్‌ వాయుదా విషయం తెలిసేనాటికి..తాను ఆ క్రీడలకు చక్కగా సిద్ధమవుతున్నానని సింధు వెల్లడించింది. కానీ రోజుకో దేశం కొవిడ్‌-19 బారినపడుతుండడంతో ఈ ఏడాది ఒలింపిక్స్‌ వాయిదా వేయక తప్పలేదు. ఏదేమైనా..ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అన్నింటికంటే జీవితమే ముఖ్యమని వ్యాఖ్యానించింది. 


ఎన్ని సినిమాలో...

ఇంగ్లండ్‌ నుంచి వచ్చినప్పటినుంచి ఇంట్లో తన గదికే పరిమితమయ్యానని తెలిపింది. జీవితంలో ఇన్ని రోజుల విరామం లభిస్తుందని తానెప్పుడూ ఊహించలేదని వెల్లడించింది. ప్రస్తుతం టోర్నమెంట్లు, ప్రాక్టీ్‌సలాంటివి లేకపోవడంతో ఆలస్యంగా నిద్ర లేవడంతోపాటు కొద్దిపాటి వ్యాయామాలే చేస్తున్నానని చెప్పింది. అనంతరం టీవీలలో తెలుగు, హిందీ సినిమాలు చూస్తూ కాలక్షేపం చేస్తున్నానని తెలిపింది. ‘ఎన్ని సినిమాలు చూస్తున్నానంటే...నేను వీక్షిస్తున్న సినిమాలలో కొన్నింటి పేర్లు కూడా నాకు గుర్తులేవు’ అని చెప్పింది. 2011లో విడుదలైన హాలీవుడ్‌ చిత్రం ‘కంటేజియన్‌’ చూశానని తెలిపింది. ఆ సినిమాలో మాదిరే ప్రస్తుతం ప్రపంచాన్ని ఓ వైరస్‌ పట్టిపీడిస్తోందని చెప్పింది. తమ ఇంటికి మూడిళ్ల అవతల అక్క ఉంటుందని, ఆమె ఏడాదిన్నర కుమారుడిని చూసేందుకు కూడా వెళ్లడంలేదని తెలిపింది. 


అమ్మకు సాయపడుతున్నా..

బ్యాడ్మింటన్‌ ఆడే అవకాశం ఎలాగూ లేనందున..అదేపనిగా ఇంటివద్ద ఉంటే ఒకింత బోరింగ్‌గా ఉంటోందని సింధు చెప్పింది. దాంతో వంటగదిలో తల్లికి సాయం చేస్తున్నానని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల రీత్యా చూస్తే లాక్‌డౌన్‌ను పొడిగిస్తారని అభిప్రాయపడింది. అయితే ఏం జరుగుతుందో చూడాలని పేర్కొంది. కరోనా కేసు లు, మరణాలు తగ్గిపోతాయన్న ఆశాభావాన్ని సింధు వ్యక్తంచేసింది.

Advertisement

క్రీడాజ్యోతిమరిన్ని...

Advertisement
Advertisement