Abn logo
Oct 22 2021 @ 00:03AM

కుంగుతున్న పెద్దమరువపల్లె చెరువు కట్ట

కుంగిపోయిన పెద్దమరువపల్లె చెరువుకట్ట

ములకలచెరువు, అక్టోబర్‌ 21: మండలంలోని బురకాయలకోట సమీ పంలోని పెద్ద మరువపల్లె చెరువుకట్ట ప్రమాదకర స్థాయికి చేరింది. చెరువుకట్ట ఏ క్షణమైనా తెగిపోయే ప్ర మాదం ఉందని ఐదు గ్రామాల ప్ర జలు భయాందోళన చెందుతున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు పెద్ద మరువపల్లె చెరువు నిండి మొరవ పోతోంది. ఈ నేపథ్యంలో చెరువు కట్ట క్రమంలో కుంగుతోంది. ప్రస్తుతం చెరువు కట్ట ఏ క్షణమైనా తెగిపోయే ప్రమాదం ఏర్పడింది. చెరువు కట్ట తెగిపోతే చెండ్రాజుల పల్లె, గడ్రా జులపల్లె, ఎర్రతాతన్నగారిపల్లె, మలిగివారిపల్లె, తుమ్మలవారిపల్లెలు నీట మునిగే ప్రమాదం ఉంది. అలాగే చెరువు కట్టపై రాకపోకలు సాగేంచే చిన్నమరువపల్లె, ఎండ్లపల్లె, కురవపల్లె, చెండ్రాజులపల్లెలకు రాకపోకలు నిలిపోతాయని గ్రామస్తులు చెబుతున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదంటున్నారు. కట్ట తెగిపోకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.