Abn logo
May 24 2020 @ 04:07AM

‘రొయ్యల చెరువుల తవ్వకాలను నిలుపుదల చేయాలి’

ఐ.పోలవరం, మే 23: రొయ్యల చెరువుల తవ్వకాలను నిలుపుదల చేయాలని రైతులు, గ్రామస్థులు శనివారం ఆందోళన చేపట్టారు. కొమరగిరి పంచాయతీ పరిధి మంగాపాలెంలో ఒక రైతు రెండెకరాలు వరి పొలాన్ని ఆక్వా చెరువుగా మార్చేందుకు పనులు చేపట్టారు. దీంతో సమీప రైతులు చెరువు పనులను నిలుపుదల చేయాలని ఆందోళన చేపట్టారు. ఆక్వా చెరువులతో భూముల్లో పంట నష్టపోతామని రైతులు తహశీల్దార్‌ ఎండీ.అజీజ్‌హుస్సేన్‌కు మొర పెట్టుకున్నారు. తాగునీటి జలాలు కలుషితమై ప్రజలు ఇబ్బందులకు గురవుతారని గ్రామస్థులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన తహశీల్దార్‌ చెరువు తవ్వకం పనులను నిలుపుదల చేయించారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు.

Advertisement
Advertisement
Advertisement