Advertisement
Advertisement
Abn logo
Advertisement

కరోనా కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ ప్రపంచ దేశాలను భయపెడుతోంది: శ్రవణ్ రెడ్డి

హైదరాబాద్: కోవిడ్ కొత్త ఒమైక్రాన్ ప్రపంచ దేశాలను భయపెడుతోందని పీసీసీ ప్రొఫెషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రవణ్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లపై, తీసుకొని వాళ్లపై ప్రభావం చూపుతుందా? అనేది ఎవరికి తెలియదన్నారు. ఇప్పటికే వేవ్ -1, వేవ్ -2లతో చాలా మంది చనిపోయారన్నారు. ఇప్పుడు ఈ కొత్త వేవ్‌తో.. ఆఫ్రికా, యురఫ్ దేశాలు ఇబ్బంది పడుతున్నాయన్నారు. ఆయా దేశాల నుంచి భారత్‌కు వచ్చే వాళ్ళని అడ్డుకోవాలని సూచించారు. భారతీయులు ఆయా దేశాల్లో ఉంటే జాగ్రత్తగా ఉండాలని, అక్కడి నుంచి వచ్చిన వారిని 14 రోజులు క్వారంటైన్‌లో ఉంచాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా వుండాలని, సకాలంలో చర్యలు తీసుకోకుంటే.. భారీ ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుందని శ్రవణ్ రెడ్డి పేర్కొన్నారు.


Advertisement
Advertisement