May 11 2021 @ 07:16AM

షాకింగ్ రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న ద‌ళ‌ప‌తి విజ‌య్‌..!

కోలీవుడ్ స్టార్ హీరో, ద‌ళ‌ప‌తి విజ‌య్, టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒక‌రైన దిల్‌రాజు, డైరెక్ట‌ర్ వంశీ పైడిపల్లి కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందుతుంద‌ని వార్త‌లు వినిపిస్తోన్న‌ సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో హీరో విజయ్ రెమ్యునరేషన్‌కు సంబంధించిన వార్త హల్ చల్ చేస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను దిల్‌రాజు తెలుగు, త‌మిళంతో పాటు హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లోనూ చేయాల‌నుకుంటున్న‌ట్లు ఆలోచిస్తున్నారు. అందుకు త‌గిన‌ట్లే అంద‌రికీ క‌నెక్ట్ అయ్యే యూనిక్ పాయింట్‌తో సినిమాను రూపొందించ‌డానికి క‌థ‌ను సిద్ధం చేయిస్తున్నారు. కాగా..లేటెస్ట్ బ‌జ్ ప్ర‌కారం ఈ సినిమాకు దిల్‌రాజు భారీ దాదాపు రూ.170 కోట్ల బ‌డ్జెట్ పెడుతున్నార‌ట‌. ఇందులో హీరో విజ‌య్‌కు రూ.90 కోట్ల రెమ్యున‌రేష‌న్ ఆఫ‌ర్ చేశార‌ని అంటున్నారు. కోలీవుడ్ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న స‌మాచారం మేర‌కు విజ‌య్ రీసెంట్ టైమ్‌లో త‌న సినిమాల‌కు రూ.80 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నారు. దాన్ని మించిన రెమ్యున‌రేష‌న్ ఆఫ‌ర్ చేసి దిల్‌రాజు, విజ‌య్ డేట్స్ తీసుకున్నార‌ని టాక్ వినిపిస్తోంది.