Abn logo
Oct 11 2021 @ 19:19PM

మంత్రి హరీశ్‌రావు సభలో ఖాళీ కుర్చీలు

హుజూరాబాద్: మంత్రి హరీశ్ రావు ప్రచార సభలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ఉపఎన్నికల నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు ఎన్నికల సభలో మాట్లాడారు. అయితే ఈ సభలో ముందు వరుసలో మాత్రమే జనాలు ఉన్నారు. వెనుక వరుసలో జనాలు లేక ఖాళీ కుర్చీలు కనిపించాయి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

కాగా హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు ఈ నెల 30న ఎన్నికల జరగనున్నాయి. టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్, బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి బలమూరి వెంకట్‌ పోటీ చేస్తున్నారు. ఇప్పటికే నామినేషన్ల పర్వం ముగిసింది. మొత్తం 42 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. ప్రస్తుతం నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఈ నెల 13తో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగుస్తుంది. దీంతో ప్రధాన పార్టీ అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. 

ఇవి కూడా చదవండిImage Caption

తెలంగాణ మరిన్ని...

క్రైమ్ మరిన్ని...