Abn logo
Sep 28 2020 @ 04:24AM

హామిల్టన్‌కు షాక్‌..!

Kaakateeya

రష్యన్‌ గ్రాండ్‌ ప్రీలో మూడో స్థానం


సోచి (రష్యా): దిగ్గజం మైకేల్‌ షూమాకర్‌ 91 ఫార్ములా-1 విజయాల రికార్డును సమం చేయాలనుకున్న మెర్సిడెస్‌ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌కు షాక్‌ తగిలింది. రష్యన్‌ గ్రాండ్‌ ప్రీలో రెండుసార్లు పెనాల్టీ విధించడంతో హామిల్టన్‌ మూడో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రేస్‌ ఆరంభానికి ముందు నిర్దేశిత ప్రదేశంలో కాకుండా పిట్‌ లైన్‌ ఎగ్జిట్‌ వద్ద హామిల్టన్‌ రెండుసార్లు ప్రాక్టీస్‌ చేశాడు. నిబంధనలను అతిక్రమించిన లూయి్‌సకు ఐదేసి సెకన్ల చొప్పున రెండుసార్లు పెనాల్టీ విధించారు. లూయిస్‌ సహచరుడు, మెర్సిడె్‌సకే చెందిన వాల్టెరీ బొటాస్‌ విజేతగా నిలవగా.. రెడ్‌ బుల్స్‌కు చెందిన మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ రెండో స్థానం దక్కించుకున్నాడు. 

Advertisement
Advertisement
Advertisement