Sep 27 2021 @ 11:58AM

‘గాడ్ ఫాదర్’ లో కీలకపాత్రలో శోభన?

మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రంగా తమిళ దర్శకుడు మోహన్ రాజా రూపొందిస్తున్న యాక్షన్ అండ్ పొలిటికల్ థ్రిల్లర్ ‘గాడ్ ఫాదర్’. ఈ సినిమా షూటింగ్ ఇటీవల ఊటీలో మొదలైన సంగతి తెలిసిందే. మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ కు రీమేక్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా స్ర్కిప్ట్ ను తెలుగు నేటివిటీకి, మెగాస్టార్ ఇమేజ్ కు అనుగుణంగా దర్శకుడు తీర్చిదిద్దారు.  ఇక ఇందులో చిరుకి రైట్ హ్యాండ్ గా ఉండే పాత్రను బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. కాగా.. ఒరిజినల్ లో మంజువారియర్ చేసిన ముఖ్యమంత్రి కూతురి పాత్రను నిన్నటితరం మలయాళ హీరోయిన్ శోభన చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. 

చిరంజీవి,  శోభన గతంలో ‘రుద్రవీణ, రౌడీ అల్లుడు’ చిత్రాల్లో జోడీగా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ‘గాడ్ ఫాదర్’ లో  అన్నా, చెల్లెళ్ళుగా కనిపిస్తారు.  అలాగే.. ఇందులో మరో పాత్ర అయిన ముఖ్యమంత్రి వారసుడి పాత్రను సత్యదేవ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఫ్రెంచ్ సూపర్ హిట్ మూవీ  ‘లార్గోవించ్’ బేస్ గా సాగే ఈ సినిమా కథాంశం .. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. మరి నిజంగానే ఇందులో శోభన నటిస్తుందో లేదో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.