May 15 2021 @ 07:19AM

రెండు ద‌శాబ్దాలు.. రీ ఎంట్రీ ఇస్తున్న శిల్పాశెట్టి!

బాలీవుడ్ న‌టి శిల్పా శెట్టి.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా సుప‌రిచితురాలే. తెలుగులో బాల‌కృష్ణ‌, మోహ‌న్‌బాబు, వెంక‌టేశ్‌, నాగార్జున వంటి స్టార్ హీరోల‌తో ఈమె జోడీ క‌ట్టింది. త‌ర్వాత బాలీవుడ్ సినిమాల‌తోనే బిజీగా మారిపోయింది. రెండు ద‌శాబ్దాల త‌ర్వాత శిల్పాశెట్టి మ‌ళ్లీ టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. వివ‌రాల్లోకెళ్తే.. సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో మూడో సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ఓ ముఖ్య పాత్ర కోసం శిల్పాశెట్టిన న‌టింప చేయడానికి త్రివిక్ర‌మ్ చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ట‌. అలాగే మ‌రో కీల‌క పాత్ర‌లోహీరో సుమంత్‌ను న‌టింప చేయాల‌ని కూడా త్రివిక్ర‌మ్ భావిస్తున్నట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.