Abn logo
Oct 13 2020 @ 01:41AM

గొర్రెలను పంపిణీ చేయాలి

Kaakateeya

మేడ్చల్‌: రాష్ట్ర ప్రభుత్వం రెండవ విడత గొర్రెలను పంపిణీ చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం మేడ్చల్‌ జాతీయ రహదారిపై బస్‌డిపో వద్ద గొల్ల, కుర్మలు గొర్రెలతో ధర్నా చేశారు. ఈ సందర్భంగా రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు గొర్రెలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గొర్రెల కోసం డీడీలు తీసి సంవత్సరకాలంగా వేచి చూస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇంత వరకు గొర్రెలను పంపిణీ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో 241 మంది డీడీలు చెల్లించారన్నారు.


గొర్రెలకు ఇన్సూరెన్స్‌ సౌకర్యం కూడా కల్పించడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా డీడీలు చెల్లించిన వారికి వెంటనే గొర్రెలను పంపిణీ చేయాలని వారు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో గొల్ల, కుర్మల సంఘం జిల్లా అధ్యక్షుడు కొమురయ్య, కార్యదర్శి బి.వెంకటేశం, పట్టణ అధ్యక్షుడు పోచయ్య, కృష్ణ, రాజు, భూపాల్‌, చంద్రయ్య, శ్రీకాంత్‌, మల్లేష్‌, బాలు, లక్ష్మణ్‌, సత్యనారాయణ, నాగరాజు పాల్గొన్నారు.

Advertisement
Advertisement