Oct 13 2021 @ 11:32AM

Sharukh వల్లే Aryan టార్గెట్ అయ్యాడు.. Shatrughan Sinha షాకింగ్ కామెంట్స్!

బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం బాలీవుడ్‌లో కలకలం రేపింది. ఆర్యన్ ఖాన్ అరెస్ట్‌ విషయంలో షారూక్‌కు ఎంతో మంది బాలీవుడ్ ప్రముఖులు మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై బాలీవుడ్‌ సినీయర్‌ నటుడు శత్రుఘ్న సిన్హా కూడా స్పందించారు. షారూక్ వల్లే ఆర్యన్‌ టార్గెట్‌ అయ్యాడని అన్నారు. 


`ఈ ఘటనపై పోరాడటానికి సినీ పరిశ్రమ నుంచి ఎవరూ ముందుకు రావడం లేదు. ఇది వేరొకరి సమస్య అనుకుంటారు. వారే దీన్ని పరిష్కరించుకోవాలనుకుంటున్నారు. మీడియాలాగానే సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు కూడా భయపడుతున్నారు. ఈ కేసులో ఆర్యన్‌ టార్గెట్‌గా మారడానికి అతని మతమే కారణమని కొందరు అభిప్రాయపడుతున్నారు. అది వాస్తవం కాదు. ఏ మతానికి చెందినవాడైనా అతను భారతీయుడే. అన్ని మతాల వారికీ రాజ్యాంగం ఒకటే. ఈ కేసులో చాలా మంది అరెస్ట్ అయినా ఆర్యన్ మాత్రమే టార్గెట్ కావడానికి కచ్చితంగా షారూకే కారణం. షారూక్ సెలబ్రిటీ కావడం వల్లే ఆర్యన్ టార్గట్‌గా మారాడు. ఇంతకుముందు ఓ కేసులో కూడా ఇలాగే దీపిక పదుకొనే పైన మాత్రమే మీడియా ఎక్కువగా ఫోకస్‌ పెట్టింద`ని శత్రుఘ్న అన్నారు. 

Bollywoodమరిన్ని...