Abn logo
Mar 6 2021 @ 09:49AM

`మహాసముద్రం`: శర్వానంద్ రఫ్ లుక్!

యంగ్ హీరో శర్వానంద్ వరుసగా వైవిధ్యభరిత సినిమాలను అంగీకరిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఒకవైపు `శ్రీకారం` వంటి గ్రామీణ నేపథ్యంలో సినిమా చేస్తూనే.. మరోవైపు `మహాసముద్రం` వంటి మాస్ ఓరియెంటెడ్ చిత్రంలోనూ నటిస్తున్నాడు. శర్వానంద్ జన్మదినోత్సవం సందర్భంగా తాజాగా `మహాసముద్రం` ఫస్ట్‌లుక్ విడుదలైంది. ఈ పోస్టర్‌లో శర్వానంద్ మాస్, రఫ్ లుక్‌లో ఉన్నాడు. పూర్తి యాక్షన్ మోడ్‌లో భీకరంగా ఉన్నాడు.

 `ఆర్ఎక్స్100` సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడు అజయ్ భూపతి `మహాసముద్రం` సినిమాను తెరకెక్కిస్తున్నాడు. శర్వానంద్‌తోపాటు సిద్ధార్థ్ మరో హీరోగా నటిస్తున్నాడు. అదితీరావు హైదరీ, అనూ ఇమ్మానుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 19న విడుదల కాబోతోంది. ఇక, శర్వానంద్ నటించిన `శ్రీకారం ట్రైలర్ తాజాగా విడుదలై అందరినీ ఆకట్టుకుంది.`


Advertisement
Advertisement
Advertisement