Abn logo
Jul 13 2020 @ 16:47PM

పార్కును దత్తత తీసుకున్న శర్వానంద్!

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ తాజాగా `గ్రీన్ ఇండియా` ఛాలెంజ్‌ను పూర్తి చేశాడు. బంజారా హిల్స్‌లోని తన ఇంటి పక్కన పార్కు‌లో మొక్కలు నాటాడు. ఈ కార్యక్రమంలో శర్వానంద్‌తోపాటు రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ `సంతోష్ అన్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయణ్ని స్ఫూర్తిగా తీసుకుని నేను కూడా మొక్కలు నాటాలని నిర్ణయం తీసుకున్నాను. వాతావరణ మార్పులు, కాలుష్యం కారణంగా మనం భవిష్యత్తులో ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితి వస్తుంది. దానిని నిరోధించాలంటే మనందరం మొక్కలు నాటి, వాటిని సంర‌క్షించాలి. భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించాల`ని అన్నాడు. అలాగే తన ఇంటి పక్కన ఉన్న జీహెచ్‌ఎంసీ పార్కును దత్తత తీసుకుంటున్నట్టు తెలిపాడు. పార్కులో వాకింగ్ ట్రాక్‌ ఏర్పాటుకు, పార్కు అభివృద్ధికి సొంత డబ్బులు ఖర్చు చేస్తానన్నాడు.

Advertisement
Advertisement
Advertisement