Abn logo
Oct 21 2020 @ 06:08AM

వైభవంగా శరన్నవరాత్రులు

కర్నూలు (కల్చరల్‌), అక్టోబరు 20: దేవీ శరన్నవరాత్రలు వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారు రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. మంగళవారం నాలుగో రోజు ఆలయాల్లో భక్తులు పూజలు చేశారు. కర్నూలు నగరంలో పూల బజార్‌లోని చిన్న అమ్మవారిశాలలో అమ్మవారికి సర్వకాళీ దేవిగా, వన్‌టౌన్‌ కాళికాంబ ఆలయంలో మంగళగౌరి దేవిగా, మణికంఠ అయ్యప్పస్వామి ఆలయ ఆవరణలో ఉన్న చౌడేశ్వరి మాతా ఆలయంలో అమ్మవారికి మహాలక్ష్మి దేవిగా, చిత్తారి వీధిలోని నిమిషాంబా దేవి ఆలయంలో లలితా త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. 


ఆదోని: దసర నవరాత్రుల్లో భాగంగా మంగళవారం మహాయోగి లక్ష్మమ్మవ్వ  పంచ వర్ణాల అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.  ఎంఎం కాలనీలోని మాతాపరమేశ్వరి దేవి ఆలయంలో అమ్మవా రు భక్తులకు అన్నపూర్ణా దేవిగా దర్శనమిచ్చారు. 


ఆలూరు రూరల్‌లో.. ఆలూరులోని వాసవి కన్యకాపరమేశ్వరి దేవి ఆలయంలో  మహాలక్ష్మి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.   కోటవీధిలోని  సుంకులమ్మదేవి ఆలయంలో అమ్మవారు అన్నపూర్ణ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.  


గూడూరు: కె.నాగులాపురంలోని  సుంకులమ్మ అమ్మవారు మం గళవారం లలితా త్రిపురసుందరిదేవి అలంకరణలో దర్శనం ఇచ్చారు.

  

పత్తికొండ: దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారు గజలక్ష్మి అలంకరణలో దర్శనమిచ్చారు. పత్తికొండ కన్యకాపరమేశ్వరి దేవాలయం, షిర్డీసాయి ఆలయ సమూహంలోని సరస్వతి, కనకదుర్గాదేవి ఆలయాల్లో ఉత్సవాలను నిర్వహించారు. 


మద్దికెర: మద్దికెర నగరేశ్వరస్వామి ఆలయంలో  అమ్మవారిని వాసవీమాతగా మంగళవారం అలంకరించారు.  ఆర్యవైశ్య సంఘం నాయకులు రవీంద్రనాథ్‌శెట్టి, రాజశేఖర్‌శెట్టి పాల్గొన్నారు. 


నందవరం: దసరా శరన్నరాత్రోత్సవాల్లో భాగంగా నాగలదిన్నెలోని అమ్మవారు విగ్రహానికి నిర్వాహకులు శ్రీనివాసరెడి,్డ బేబి పూజలు నిర్వహించారు. బుధవారం విగ్రహ ప్రతిష్ఠ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే సోమలగూడురులో శ్రీధర్‌స్వామి ఆధ్వర్యంలో పెద్దమ్మ ఆలయంలో పూజలు చేశారు. 


బేతంచెర్ల: పట్టణంలోని వాసవీ కన్యకా పరమేశ్వరి  ఆలయంలో అమ్మవారు   దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా 4వ రోజు అన్నపూర్ణదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. మద్దిలేటి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో  మహాలక్ష్మీదేవి అమ్మవారు గజలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. 

Advertisement
Advertisement