Abn logo
Dec 2 2020 @ 15:54PM

దేశంలో అత్యంత బలహీన సీఎం జగన్: శైలజానాథ్

శ్రీకాకుళం జిల్లా: దేశంలో అత్యంత బలహీనమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ విమర్శించారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన మాట్లాడుతూ ఢిల్లీ రైతులకు మద్దతుగా వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. మీటర్ల పేరుతో రైతులకు ఉరితాళ్లు వేస్తే ఊరుకోమని హెచ్చరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పినట్లు సీఎం జగన్ తలూపుతున్నారని విమర్శించారు. రైతులకు గౌరవం రావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని శైలజానాథ్ అన్నారు.

Advertisement
Advertisement
Advertisement