Abn logo
Sep 28 2020 @ 00:24AM

షాహిద్‌ షూటింగ్‌ షురూ!

Kaakateeya

తెలుగులో హిట్టైన ప్రతి సినిమా మీద కన్నేస్తున్నారు బాలీవుడ్‌ హీరో షాహిద్‌ కపూర్‌. ‘అర్జున్‌రెడ్డి’ సినిమాను ‘కబీర్‌ సింగ్‌’గా రీమేక్‌ చేశారు. నాని నటించిన ‘జెర్సీ’ సినిమా రీమేక్‌లోనూ ఆయనే కథానాయకుడు. కరోనా వల్ల షూటింగ్‌కు బ్రేక్‌ పడింది. ఇప్పుడు మళ్లీ షూటింగ్‌ మొదలుపెట్టడానికి షాహిద్‌ బృందం సిద్ధమవుతున్నారు. అక్టోబర్‌ మొదటి వారంలో ఈ సినిమా షూటింగ్‌ మొదలుకానుంది. 15 రోజులపాటు డెహ్రాడూన్‌, చండీఘర్‌ ప్రాంతాల్లో చిత్రీకరణ చేయనున్నారట. ‘‘నిబంధనల నడుమ షాహిద్‌, మృణాల్‌ ఠాకూర్‌ మధ్య సాగే డ్రామా, భావోద్వేగ సన్నివేశాలు తెరకెక్కిస్తాం. ప్రస్తుతానికి క్రికెట్‌ సంబంధిత సన్నివేశాలు చిత్రీకరించడం లేదు. కరోనా పరిస్థితులు మెరుగయ్యాక ఆ సన్నివేశాలను చిత్రీకరిస్తాం’’ అని షాహిద్‌ కపూర్‌ సన్నిహిత వర్గాలు తెలిపాయి. తెలుగులో దర్శకత్వం వహించిన గౌతమ్‌ తిన్ననూరి హిందీలోనూ తెరకెక్కిస్తున్నారు.  

Advertisement
Advertisement
Advertisement