Sep 27 2021 @ 23:43PM

సమంతతో నటించాలనుంది! షాహిద్‌ కపూర్‌

సమంతతో నటించాలనుందని హిందీ హీరో షాహిద్‌ కపూర్‌ చెప్పారు. సోమవారం ట్విట్టర్‌లో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. అప్పుడొకరు ‘ఫ్యామిలీ మేన్‌-2లో సమంత నటన గురించి చెప్పండి?’ అని అడగ్గా... ‘‘ఆ వెబ్‌ సిరీస్‌లో  ఆమె అభినయం నచ్చింది. ఎప్పుడో ఒకప్పుడు ఆమెతో పని చేయాలని అనుకుంటున్నాను’’ అని షాహిద్‌ కపూర్‌ బదులిచ్చారు. ‘‘నాని ‘జెర్సీ’ చిత్రంలో అద్భుతంగా నటించాడు. అతని నటన చూసి కన్నీళ్లు వచ్చాయి.


హిందీలో ‘జెర్సీ’ చేయడానికి అతనే స్ఫూర్తి. ఇప్పటివరకూ నేను పనిచేసిన దర్శకుల్లో ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి నా ఫెవరెట్‌ అనుకుంటున్నాను’’ అని షాహిద్‌ కపూర్‌ చెప్పారు. సమంత విషయానికి వస్తే... ‘శాకుంతలం’ చిత్రీకరణ పూర్తి చేశాక కొత్త చిత్రాలేవీ అంగీకరించలేదు. నటనకు కాస్త విరామం ఇచ్చిన ఆమె, వ్యక్తిగత పనులతో బిజీగా ఉంటున్నారు. సోమవారం వర్షంలో సైక్లింగ్‌ చేశారు. ‘‘తొలిరోజు 21 కిలోమీటర్లు సైకిల్‌ తొక్కాను. వంద కిలోమీటర్లు తొక్కడమే నా లక్ష్యం’’ అని సమంత తెలిపారు.

Bollywoodమరిన్ని...