Sep 28 2021 @ 16:03PM

భార్యా.. పిల్లలా..? ఫన్నీ ప్రశ్న అడిగి చిక్కుల్లో పెట్టిన అభిమాని.. Shahid Kapoor ఇచ్చిన రిప్లై ఇదీ..

తెలుగు `అర్జున్‌రెడ్డి` హిందీ రీమేక్ `కబీర్ సింగ్`తో భారీ విజయం అందుకుని తిరిగి లైమ్‌లైట్‌లోకి వచ్చాడు బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్. ప్రస్తుతం మరో తెలుగు రీమేక్ చేస్తున్నాడు. నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి రూపొందించిన `జెర్సీ` సినిమా హిందీ రీమేక్‌లో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. 


తాజాగా ట్విటర్ ద్వారా అభిమానులకు అందుబాటులోకి వచ్చిన షాహిద్ వారి ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. ఓ అభిమాని అడిగిన సరదా ప్రశ్నకు అంతే ఫన్నీగా సమాధానమిచ్చి ఆకట్టుకున్నాడు. `మీ భార్య మీరా లేదా మీ పిల్లలు మిషా, జైన్.. వీరిలో ఎవరిని హ్యాండిల్ చేయడం మీకు సులభంగా ఉంటుంద`ని ఓ నెటిజన్ అడిగాడు. ఈ ప్రశ్నకు షాహిద్ స్పందిస్తూ.. `ఈ ప్రశ్న చూస్తుంటే మీకింకా పెళ్లి కాలేదని అర్థమవుతోంది` అంటూ ఫన్నీగా స్పందించాడు. అలాగే నేచురల్  స్టార్ నాని గురించి ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ``జెర్సీ`లో నాని నటన అద్భుతంగా ఉంది. అతను నన్ను ఏడిపించాడు. ఈ సినిమా చేయడానికి నానియే నాకు స్ఫూర్తి` అని సమాధానమిచ్చాడు.  

Bollywoodమరిన్ని...