Oct 12 2021 @ 14:18PM

Aryan Khan Case: ఆ రోజు నుంచి షారూక్ దంపతులు ఏం చేస్తున్నారంటే..

బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ వ్యక్తిగత సమస్యలతో సతమతమవుతున్నాడు. కొన్ని రోజులుగా షారూక్ వరుస వైఫల్యాలు ఎదుర్కొంటున్నాడు. దాదాపు రెండేళ్ల పాటు వెండితెరకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడిప్పుడే సినిమా షూటింగ్‌లకు హాజరవుతున్నాడు. ఈ తరుణంలో ఆయన కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టయ్యాడు. ఈ నెల 3వ తేదీన ముంబై తీరంలోని ఓ క్రూయిజ్ షిప్‌లో పార్టీ చేసుకుంటూ నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులకు ఆర్యన్ దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఆర్యన్‌కు బెయిల్ దొరకలేదు. 


మూడుసార్లు ఆర్యన్ బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైన సంగతి తెలిసిందే. ఆర్యన్ అరెస్ట్ అయినప్పటి నుంచి షారూక్ దంపతులు నిద్రలేని రాత్రులు గడపుతున్నారట. మూడో తేదీ నుంచి షారూక్, గౌరి సరిగ్గా నిద్రపోలేదట. ఆర్యన్ బెయిల్ కోసం న్యాయవాదులను కలుస్తూ షారూక్ బిజీగా తిరుగుతున్నాడట. ఇక, గౌరి జైలుకు పలుసార్లు ఫోన్లు చేస్తూ ఆర్యన్ ఆరోగ్యం గురించి వాకబు చేస్తోందట. డిప్రెషన్‌లో ఉన్న కొడుకును కనిపెట్టుకుని ఉండడానికి వీలు లేకపోవడంతో ఆమె జైలు అధికారులతో తరచుగా మాట్లాడుతోందట. ఇంటి భోజనం పంపిస్తోందట. ఆర్యన్‌కు బెయిల్ వచ్చే వరకు షారూక్, గౌరి నిద్రాహారాలకు దూరంగానే ఉంటారని సన్నిహితులు చెబుతున్నారు.  


Bollywoodమరిన్ని...