Abn logo
Feb 25 2021 @ 22:22PM

‘షాదీ ముబారక్’కు గ్యారంటీ ఇచ్చిన దిల్‌రాజు

స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాల‌నే కాదు.. యూత్‌ను, ఫ్యామిలీ ఆడియెన్స్ హృద‌యాలు హ‌త్తుకునేలా కూల్ అండ్ ప్లెజెంట్ మూవీస్‌ను అందిస్తూ ఎన్నో సూప‌ర్ డూప‌ర్ హిట్స్‌ను సొంతం చేసుకున్న నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌. ఈ బ్యాన‌ర్ నుంచి తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డానికి సిద్ధ‌మ‌వుతోన్నమ‌రో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘షాదీ ముబారక్‌’‌. వీర్‌సాగర్‌, దృశ్యా రఘునాథ్‌ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి పద్మ శ్రీ దర్శకత్వం వహించారు. దిల్‌రాజు, శిరీష్ నిర్మాత‌లు.  ‘షాదీ ముబారక్‌’ మార్చి 5న విడుద‌లవుతుంది. ఈ సంద‌ర్భంగాగా గురువారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో చిత్ర ట్రైల‌ర్‌ను నిర్మాత దిల్‌రాజు విడుద‌ల చేశారు. 

ట్రైలర్‌ విడుదల అనంతరం దిల్‌రాజు మాట్లాడుతూ.. ‘‘2020లో కోవిడ్ రావడం ఏంటో కానీ.. 2021లో సినిమాలు విడుద‌ల‌వుతున్న తీరు చూస్తుంటే, 90లో ప్ర‌తి వారం రెండు, మూడు సినిమాలు విడుద‌ల‌య్యేరోజులు గుర్తుకు వ‌స్తున్నాయి. ఇప్పుడు సినిమాల ఫ్లో స్టార్ట్ అయ్యింది. చిన్న‌, పెద్ద సినిమాలు  ఫ్లో అవుతున్నాయి. ఈ ఏడాది మా బ్యాన‌ర్ నుంచి వ‌స్తున్న సినిమాలు కానీ, ఇత‌ర నిర్మాత‌ల‌తో క‌లిసి స‌హ నిర్మాణంలో చేస్తున్న సినిమాలు ఫ్లో ఎక్కువ‌గా ఉన్నాయి. ఇక ‘షాదీ ముబార‌క్’ సినిమా విష‌యానికి వ‌స్తే.. యూనిట్ సినిమాను పూర్తి చేసుకున్న త‌ర్వాత ఓరోజు సాగ‌ర్ నాకు సినిమా ట్రైల‌ర్‌ను చూపించాడు. చాలా ఆస‌క్తిక‌రంగా అనిపించ‌డంతో సినిమా చూస్తాన‌ని అన్నాను. సినిమా చూశాను. అక్క‌డ‌క్క‌డ కొన్ని పోర్ష‌న్స్ త‌ప్పితే సినిమా అంతా హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైనర్‌గా అనిపించింది. సినిమాను చాలా బాగా తెర‌కెక్కించారు. నాకు సినిమాపై ఉన్న ఆలోచ‌న‌ను ఎలా చేయాలో శ్రీనివాస్ రెడ్డిగారికి, సాగ‌ర్‌కి చెప్పాను. వాళ్లు బాల్‌ని నా కోర్టులో వేశారు. నేను నాకు అనిపించిన క‌రెక్ష‌న్స్ గురించి చెప్పాను. వాళ్లు దాన్ని క‌రెక్ష‌న్స్ చేశారు. త‌ర్వాత సినిమాను రిలీజ్ చేయ‌మ‌ని మ‌రోసారి బాల్‌ను నా కోర్టులోనే వేశారు. మంచి సినిమాను మా బ్యాన‌ర్ నుంచి రిలీజ్ చేద్దామ‌ని నిర్ణ‌యించుకుని సినిమాను టేక్ ఓవ‌ర్ చేసుకున్నాం. సినిమా మ్యూజికల్‌గా కానీ, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కానీ అన్నీ బావున్నాయి. ద‌ర్శ‌కుడు ప‌ద్మ‌శ్రీ ఓ కొత్త పాయింట్‌తో సినిమాను తెర‌కెక్కించాడు. టీజ‌ర్, ట్రైల‌ర్ చూస్తే సినిమా హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కింద‌ని అర్థ‌మై ఉంటుంది. రెండు గంట‌ల ప‌దిహేను నిమిషాల వ్య‌వ‌ధి ఉన్న ఈ సినిమా అంతా న‌వ్విస్తూనే ఉంటుంది. నాన్ స్టాప్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ మూవీ. సినిమాను త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కులు ఎంజాయ్ చేస్తారు.. అది నా గ్యారంటీ. థియేట‌ర్‌కు వ‌చ్చి ప్రేక్ష‌కులు సినిమాను స‌క్సెస్ చేస్తార‌ని కోరుకుంటున్నాను. ఎంటైర్‌ టీమ్‌కు ఆల్ ది బెస్ట్‌’’ అన్నారు.

Advertisement
Advertisement
Advertisement