Abn logo

సేమ్యా బిర్యానీ

కావలసినవి: సేమ్యా (రోస్టేడ్‌) - పావుకేజీ, క్యారెట్‌ - ఒకటి, బీన్స్‌ - నాలుగు, క్యాప్సికం - ఒకటి, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిబఠాణీ - ఒక కప్పు, గరంమసాలా - అర టీస్పూన్‌, ధనియాల పొడి - అర టీస్పూన్‌, బిర్యానీ మసాలా - అర టీస్పూన్‌, పసుపు - ఒక టీస్పూన్‌, జీలకర్ర - ఒక టీస్పూన్‌, నూనె - సరిపడా, ఉప్పు - తగినంత.


పేస్టు కోసం : ఉల్లిపాయ-ఒకటి, సోంపు - టీస్పూన్‌, పచ్చిమిర్చి - మూడు, కొత్తిమీర-ఒక కట్ట, అల్లం-చిన్న ముక్క, వెల్లుల్లి-రెండు.


తయారీ విధానం: ముందుగా స్టవ్‌పై పాన్‌ పెట్టి కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ, సోంపు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర వేసి వేగించాలి. చల్లారిన తరువాత మిక్సీలో వేసి పేస్టులా చేసుకోవాలి. అదే పాన్‌లో మళ్లీ కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక జీలకర్ర, ఉల్లిపాయలు వేసి వేగించాలి. తరువాత క్యారెట్‌, క్యాప్సికం, బీన్స్‌, పచ్చిబఠాణీ వేసి మరికాసేపు చిన్నమంటపై వేగించుకోవాలి. తరువాత పసుపు, గరంమసాలా, ధనియాల పొడి, బిర్యానీ మసాలా వేసి కలియబెట్టాలి. ఇప్పుడు సిద్ధం చేసి పెట్టుకున్న పేస్టు, తగినంత ఉప్పు వేసి కలపాలి. ఒక కప్పు నీళ్లు పోసి మరిగించాలి. నీళ్లు మరుగుతున్న సమయంలో సేమ్యా వేయాలి. సేమ్యా ఉడికేంత వరకు ఉంచి, కొత్తిమీరతో గార్నిష్‌ చేసి దింపాలి.


పొట్టిక్కలుమొలకల వడపండుమిర్చి - చికెన్‌ ఫ్రైపండుమిర్చి ఫ్రైడ్‌ రైస్‌పాలకూర - కొత్తిమీర దోశసోయా దోశపనసపండు దోశసేమ్యా ఉప్మాసేమ్యా దోశలెమన్‌ వెర్మిసెల్లీ
Advertisement
Advertisement