Abn logo
Jan 20 2021 @ 23:34PM

ఎస్సీ, ఎస్టీల భూముల పరిరక్షణకు కృషి

శంషాబాద్‌రూరల్‌: ఎస్సీ, ఎస్టీల భూముల పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌ అన్నారు. మండల పరిధిలోని మల్కారంలో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. దళిత రైతుల అసైన్డ్‌ భూములను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించిందని, దానిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ నీరటి తన్వీరాజు, ఎంపీపీ దిద్యాల జయమ్మశ్రీనివాస్‌, మల్కారం పీఎ్‌ససీఎస్‌ చైర్మన్‌ బుర్కుంట సతీష్‌, వైస్‌ ఎంపీపీ నీలనాయక్‌, సర్పంచ్‌ మాధవి, ఎంపీడీవో వినయ్‌కుమార్‌, మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement