Abn logo
May 19 2020 @ 05:02AM

స్వీయ నియంత్రణ పాటించాలి

అలంపూరు ఎమ్మెల్యే డాక్టర్‌ అబ్రహాం


ఇటిక్యాల, మే 18 : స్వగ్రామాలకు వచ్చిన వారు విధిగా స్వీయనియంత్రణ పాటించాలని అలంపూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ అబ్రహాం అన్నారు. మండలంలోని మునుగాల గ్రామానికి సోమవారం గుంటూరు జిల్లా నుంచి 52 మంది వలస కూలీలు వచ్చారు. వారిని పుల్లూరు టోల్‌ప్లాజా దగ్గర కలిసి వారికి సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో ఇటిక్యాల జడ్పీటీసీ కొప్పుల హనుమంతురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement