Abn logo
Mar 13 2021 @ 18:13PM

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత

శంషాబాద్: అనుమతులు లేకుండా తరలిస్తున్న బంగారాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీసులు పట్టుకున్నారు. ఎయిర్‌పోర్టుకు వచ్చిన ప్రయాణికులను పోలీసులు తనిఖీ చేయగా అక్రమ బంగారం రవాణా గుట్టురట్టు అయింది. వారి వద్ద నుంచి 471 గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న బంగారం విలువ దాదాపు రూ.21 లక్షల‌ విలువ ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. బంగారాన్ని ముక్కలు ముక్కలుగా కట్‌చేసి నలుగురు వ్యక్తులు నోట్లో దాచుకున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి గ్రీన్‌చానెల్‌ ద్వారా బయటికి వచ్చే ప్రయత్నం చేశారు. అయితే అనుమానం వచ్చిన పోలీసులు వారిని తనిఖీ చేయగా బంగారం దొరికింది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

క్రైమ్ మరిన్ని...