Abn logo
Sep 20 2021 @ 00:00AM

రూ.4 లక్షలు విలువైన గంజాయి స్వాధీనం

విలేఖరులకు వివరాలు వెల్లడిస్తున్న సీఐ పైడయ్య

ఆమదాలవలస : విశాఖ నుంచి పశ్చిమబెంగాల్‌కు సుమారు రూ.4లక్షలు విలువ చేసే గంజాయి తరలిస్తుండ గా సోమవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇం దుకు సంబంఽధించిన వివరాల ను సీఐ పి.పైడయ్య విలేఖరు లకు వెల్లడించారు. రహీమ్‌ షేక్‌, రబుల్‌ షేక్‌, అనీపూర్‌ షేక్‌, నుహమ్మద్‌ అలీగజీలు బ్యాగులతో సోమవారం వేకువ జామున రైల్వేస్టేషన్‌ సమీపంలో సంచరిస్తున్నారు. వీరిని పోలీసుల ప్రశ్నించగా పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో అప్రమత్త మైన పోలీసులు వారిని పట్టుకుని బ్యాగులు తనిఖీచేయగా... 24 ప్యాకెట్లల్లో 48 కిలోల గంజాయి ఉన్నట్టు గుర్తించారు. వారిని ప్రశ్నించగా విశాఖ నుంచి పశ్చిమబెంగాల్‌ తరలిస్తున్నట్టు తెలిపారు. విశాఖలో సమీర్‌ అనే వ్యక్తి నుంచి రూ.96 వేలుకు గంజాయి కొనుగోలు చేసినట్టు చెప్పారు. విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు బస్సులో చేరుకున్నారు. ఆమదాలవలస నుంచి రైలు ద్వారా పశ్చిమ బెంగాల్‌ వెళ్లే ప్రయత్నంలో పట్టుబడ్డారు. అక్కడ కిలో గంజాయి ఎనిమిది వేలుకుపై బడి పలుకుతుంది. ఈ ఘటనపై ఎస్‌ఐ కోటేశ్వరరావు కేసు నమోదు చేశారు.