Abn logo
Oct 20 2020 @ 00:03AM

20 ఎర్రచందనం దుంగలు పట్టివేత

రామాపురం, అక్టోబరు19: రాయచోటి పరిధిలో ఫారెస్టు రేంజ్‌ ఆఫీసర్‌ మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఎర్రచందనం స్మగర్ల కోసం అడవులలో సోమవారం తెల్లవారుజామున గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా గడికోట బీట్‌లోని మొగిలిసెల ప్రదేశంలో వేలూరుకు చెందిన శేఖర్‌, చిన్నప్పయన్‌ అనే ఇరువురిని అరెస్టు చేశారు.


వారి వద్ద నుంచి 20 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు రేంజర్‌ తెలిపారు. వాటి విలువ సుమారు రూ.2.50 లక్షలు ఉంటుందన్నారు.  ఈ దాడుల్లో ఫారె స్టు సిబ్బంది, డిప్యూటీ రేంజర్‌ ఆఫీసర్‌ రమే్‌షబాబు, ఎప్‌డీవో బీ. కృష్ణప్రసాద్‌, రఘుపతిరాజు, ఎఫ్‌బీవోలు, ప్రొటెక్సన్‌ వాచర్లు పాల్గొన్నారు.

Advertisement
Advertisement