Abn logo
Sep 22 2020 @ 03:20AM

మహిళలకు భద్రత కరువు

ఒంగోలు (కార్పొరేషన్‌), సెప్టెంబరు 21: జిల్లాలో మహిళలకు భద్రత కరువైందని తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు రావుల పద్మజ అన్నారు. శింగరాయకొండ మండలం కనమళ్ళ గ్రామానికి చెందిన  మైనర్‌ బాలికను అపహరించిన ఘటనపై ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం దారుణమని అన్నారు.


సోమవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. గత నెల 22 నుంచి బాలిక కనిపించకుంటే ఇంతవరకు పట్టించుకోలేదన్నారు. నిందితుడిపై ఫోక్స్‌ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి, శిక్షించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో ఆర్ల వెంకటరత్నం, మంగపాటి ప్రశాంతి, ఉప్పలపాటి నాగేంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement