Advertisement
Advertisement
Abn logo
Advertisement

సెక్టార్ లీడర్‌... ఐసీఐసీఐ...

ముంబై : డిజిటల్ బ్యాంకింగ్ సేవలు, గ్రోత్‌ ఎబిలిటీ, తక్కువ వాల్యుయేషన్‌ కలిసి... ఐసీఐసీఐ స్టాక్‌లో హైరేంజ్‌ కళ ఉట్టిపడుతోందని, ఇవి ఈ బ్యాంక్‌ను సెక్టార్ లీడర్‌గా నిలబెడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. కస్టమర్ లైఫ్ సైకిల్ కాస్ట్‌ తగ్గడం, క్రాస్ సెల్లింగ్స్‌ ద్వారా అధిక రాబడితో వ్యాపారం వృద్ధి చెందుతుందని, దీని వల్ల ఏడాదిలో స్టాక్ 47 శాతం వరకు పైకి ఎగబాకుతుందని భావిస్తున్నారు. మరికొన్ని వివరాలిలా ఉన్నాయి. 


డిజిటల్ వృద్ధి... ‘ఐ మొబైల్’ యాప్‌ను తీసుకొచ్చిన బ్యాంక్‌... మార్టగేజ్‌లు, ఇతర రిటైల్ ఉత్పత్తుల కోసం డిజిటల్ లెండింగ్ సొల్యూషన్ అయిన 'ఐ-లెన్స్'ను ప్రారంభించింది. అంతేగాకుండా...  అమెజాన్‌తో కార్డ్ పార్ట్‌నర్‌షిప్‌(దాదాపు 2 మిలియన్ కార్డ్‌లు జారీ చేసింది) కారణంగా మంచి మార్కెట్ షేర్‌ను, ఆదాయాన్ని పొందింది. 


స్టార్టప్స్‌తో భాగస్వామ్యం...  

పేమెంట్స్‌, లెండింగ్స్‌, రిస్క్ మేనేజ్‌మెంట్ వంటి వర్టికల్స్‌లో ముందడుగులో ఉండడానికి స్టార్టప్‌లతో టై-అప్‌ పెట్టుకుంది. మొత్తం... 130 కి పైగా ఫిన్‌టెక్ సంస్థలతో కలిసి పని చేస్తోంది. గత రెండేళ్లలో దాదాపు 15 స్టార్టప్‌లలో పెట్టుబడి పెట్టింది.


రిటైల్ క్రెడిట్, కలెక్షన్‌... 

కస్టమర్‌ ‘రీ-అప్రూవ్డ్’ లోన్స్‌ కేటగిరీ, లేదా ‘ప్రీ-క్వాలిఫైడ్’ కేటగిరీగా విభజించడం, కస్టమర్ సెగ్మెంటేషన్, విధాన రూపకల్పన-పర్యవేక్షణ వంటి చర్యలు, 80 శాతం బౌన్స్ బ్యాక్ రేట్లను అంచనా వేయడానికి సహాయపడ్డాయి. కస్టమర్ల నుంచి రావల్సిన మొత్తం చెల్లింపుల్లో 87 శాతాన్ని డిజిటల్‌ రూపంలో బ్యాంక్‌ సేకరిస్తోంది. డిజిటల్‌ క్యాపబులిటీస్‌ పెంచుకుంటే, డిజిటల్‌ మార్గంలో పెరుగుతున్న మార్కెట్‌ను అందుకోవడానికి సహాయపడుతుందని ఐడీబీఐ క్యాపిటల్ వెల్లడించింది.


ఆర్థికాంశాల్లో మెరుగుదల...  

'సూపర్ బ్యాంక్‌టెక్'గా ఐసీఐసీఐ బ్యాంక్ మారిన నేపధ్యంలో... వ్యాపార వృద్ధి, లాభాలు, కస్టమర్ లైఫ్‌ సైకిల్ కాస్ట్ తగ్గడంతోపాటు, క్రాస్ సెల్లింగ్ ద్వారా అధిక రాబడి వంటివి ఆర్‌ఓఈ ను స్థిరంగా పెంచుతాయని ఎంకే గ్లోబల్ వెల్లడించింది. యాజమాన్యం విశ్వసనీయత, స్థిరత్వం స్టాక్‌లో నిరంతర రీ రేటింగ్‌ కొనసాగించడానికి సాయపడతాని పేర్కొంది.

Advertisement
Advertisement