Abn logo
Sep 23 2021 @ 15:46PM

టైటాన్‌‌ ఉద్యోగులకు సెబీ నోటీసులు...

ముంబై : ఇన్‌సైడ్ ట్రేడింగ్‌ ఆరోపణల నేపధ్యంలో...  వాచ్ అండ్ జ్యూవెలరీ కంపెనీ ‘టైటన్’ లో పనిచేస్తున్న 141 మంది ఉద్యోగులకు సెబీ నోటీసులు జారీ చేసింది. ఇన్‌సైడ్ ట్రేడింగ్‌ జ.రిగినట్లు సెబీ ప్రాధమికంగా గుర్తించింది. కంపెనీ ప్రమోటర్లు, ఉద్యోగులు, డైరెక్టర్లు... సంస్థలో రూ. 10 లక్షల విలువకు మించిన షేర్ల క్రయవిక్రయాలు జరిపినపక్షంలో... తప్పనిసరిగా కంపెనీకి తెలియజేయాల్సి ఉంది. ఇదే క్రమంలో... ఆయా లావాదేవీలకు సంబంధించిన వివరాలను అందించాల్సి ఉంటుంది. అయితే... 141 మంది ఉద్యోగులు ఆ వివరాలనివ్వకుండా  షేర్లు కొన్నారన్న  సమాచారంతో విచారణ జరిపించారు. ఈ లావాదేవీ... 2018 ఏప్రిల్-2019 మార్చి మధ్య జరిగింది. ఈ క్రమంలో సెబీ చర్యలు తీసుకునే అవకాశముందని చెబుతున్నారు.