Abn logo
Apr 17 2021 @ 08:54AM

నెల్లూరు వెంకటచాలం టోల్ ప్లాజా వద్ద ఎస్ఈబీ అధికారుల తనిఖీలు

నెల్లూరు: జిల్లాలోని వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద ఎస్ఈబీ అధికారులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఎటువంటి ఆధారాలు లేకుండా 114.58 గ్రాముల బంగారం, 3.5 కేజీల వెండిని తరలిస్తుండగా ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. బంగారం, వెండి తరలిస్తున్నవారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‎కు తరలించినట్లు ఎస్ఈబీ అధికారులు తెలిపారు.


Advertisement
Advertisement
Advertisement