Abn logo
Oct 13 2021 @ 23:58PM

గుడుంబా కోసం సోదాలు


రాజంపేట,అక్టోబరు 13: రాజంపేట మండలంలోని పలు గ్రామాలలో బుధవారం గుడుంబా కోసం సోదాలు నిర్వహించినట్లు ఎక్సైజ్‌ ఎస్సై పోతారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో పండుగలు ఉండడంతో ముందుగా షేర్‌ శంకర్‌తండా, నడిమి తండా, లేతమామిడి తండా, మూడు మామిళ్ల తండాల్లో తనిఖీలు చేపట్టారు. గంజాయి, గుడుంబా లాంటివి తయారుచేసినా, అక్రమంగా గంజాయి మొక్కలు పెంచినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో సిబ్బంది మహేష్‌, జీవన్‌,నవీన్‌, వాహేద్‌ తదితరులు పాల్గొన్నారు.