Abn logo
Jul 14 2020 @ 20:46PM

చిరు కోసం మరో దర్శకుడు కథ రెడీ చేశాడట

మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు సక్సెస్‌ఫుల్ చిత్రాల దర్శకుడు కొరటాల శివతో ‘ఆచార్య’ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ‘సాహో’ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో ‘లూసిఫర్’ రీమేక్ చేయనున్నారు. ప్రస్తుతం ‘ఆచార్య’ చిత్ర షూటింగ్‌కు కరోనా కారణంగా బ్రేక్ పడింది. చిరు వయసు రీత్యా.. ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పుడప్పుడే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లే అవకాశం లేదు. మరో వైపు సుజీత్ కూడా ‘లూసిఫర్’‌ను తెలుగు నెటివిటీకి అనుగుణంగా మార్పులు చేసి చిరు పిలుపు కోసం వెయిట్ చేస్తున్నాడు. వీరు కాకుండా ఆ మధ్య చిరు తన తదుపరి చిత్రాల విషయమై ఓ ఇంటర్వ్యూలో కొందరు డైరెక్టర్ల పేర్లు చెప్పిన విషయం తెలిసిందే. ఆయన చెప్పిన దర్శకులలో ఇప్పుడు మరో దర్శకుడు చిరు కోసం కథ సిద్ధం చేశాడట.


ఇంతకీ ఎవరా దర్శకుడు అనుకుంటున్నారా? ఇంకెవరు డైరెక్టర్ బాబీ. ఇటీవల ‘వెంకీమామ’తో పెద్ద సక్సెస్‌ను అందుకోలేకపోయినప్పటికీ.. సక్సెస్ ఫుల్ చిత్రం ఇచ్చిన జాబితాలో పేరు సంపాదించుకున్నాడు బాబీ. ప్రస్తుతం చిరుకు కరెక్ట్‌గా సరిపోయే ఓ కథను బాబీ రెడీ చేసి ఉంచాడట. మెగాస్టార్ ఓకే అంటే కథ వినిపించడానికి సిద్ధంగా ఉన్నాడట. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా స్టోరీ సిట్టింగ్స్‌కు కూడా చిరు సిద్ధంగా లేరని తెలియడంతో.. చిరు పిలుపు కోసం బాబీ కూడా వెయిట్ చేస్తున్నాడట. బాబీ కాకుండా చిరు లిస్ట్‌లో మరో ఇద్దరు ముగ్గురు డైరెక్టర్స్ ఉన్న విషయం తెలిసిందే.

Advertisement
Advertisement
Advertisement