Advertisement
Advertisement
Abn logo
Advertisement

నడుము కింది భాగంలో పేరుకుపోయిన కొవ్వు కరగాలంటే ఇది చేసి చూడండి..

ఆంధ్రజ్యోతి(16-11-2021)

కొందరికి నడుము కింది భాగంలో పిరుదుల దగ్గర కొవ్వు ఎక్కువగా పేరుకుంటూ ఉంటుంది. ఈ కొవ్వును కరిగించాలంటే ‘స్క్వాట్స్‌’ వ్యాయామం చేయాల్సిందే! మొదట్లో కష్టమనిపించినా చేయటం అలవాటు చేసుకుంటే ఈ వ్యాయామం తేలికగానే అనిపిస్తుంది. స్క్వాట్స్‌ చేసే పద్ధతి ఇదే!


నిటారుగా నిలబడి మోకాళ్లను వంచి కిందకి కుంగాలి. ఇలా కుంగినప్పుడు నడుం పైభాగాన్ని ముందుకు వంచి, చేతులు రెండూ మడిచి, వేళ్లను కలపాలి.


కుంగి లేచేటప్పుడు మోకాళ్లు, పాదాలు సరళ రేఖలో ఉండేలా చూసుకోవాలి.


కుర్చీ మీద కూర్చున్నంత ఎత్తు మేరకే కుంగాలి.


లేచి నిలబడ్డప్పుడు పిరుదులను, తొడలను బిగించాలి.


వంగినప్పుడు ఊపిరి పీల్చుకుని, లేచి నిలబడ్డప్పుడు వదలాలి.


ఇలా ప్రతిరోజూ క్రమం తప్పకుండా 30 స్క్వాట్స్‌ చేస్తే పిరుదుల్లో పేరుకున్న కొవ్వు కరుగుతుంది.

Advertisement
Advertisement