Abn logo
Sep 30 2020 @ 05:23AM

పొలాల్లో శాస్త్రవేత్తలు రైతులకు సూచనలు

Kaakateeya

నంద్యాల, సెప్టెంబరు 29: నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు డివిజన్‌ పరిధిలో పంటలను పరిశీలించారు. ఆర్‌ఏఆర్‌ఎస్‌ కీటక విభాగం శాస్త్రవేత్తలు డాక్టర్‌ మంజునాథ్‌, డాక్టర్‌ సృజన వివిధ ప్రాంతాలలో మంగళవారం పర్యటించారు. భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న పంటల రక్షణకు రైతులకు సూచనలు చేశారు. ఆళ్ళగడ్డ వ్యవసాయ సబ్‌ డివిజన్‌లోని గోస్పాడు, రుద్రవరం మండలాలతో పాటు కోవెలకుంట్ల మండలంలో మొక్కజొన్న, వరి, మినుము, పత్తి పొలాలను పరిశీలించారు. మొక్కజొన్నలో 25 నుంచి 40 శాతం వరకు పంటను  కత్తెర పురుగు ఆశించిందని తెలిపారు. 


వరిలో ఆకు ముడత పురుగు, జింకు, ఐరన్‌ ధాతులోపం అక్కడక్కడ గమనించినట్లు తెలిపారు. వర్షంలో మునిగిన పత్తి పంటలో నీటిని తొలగించాలని, భూస్టరు డోస్‌గా 20 కేజీల యూరియా, 10 కేజీల పొటాషియం వేయాలని రైతులకు సూచించారు. 


మినుములో పంట కోతకు వచ్చిన పొలాల్లో బూడిద తెగులు సోకిందని తెలిపారు. బూడిద తెగులు నివారణకు ఒక గ్రాము కార్బండిజమ్‌ను ఒక లీటర్‌ నీటిలో, లేదా కావాచ్‌ 1.5 గ్రాములు ఒక లీటర్‌ నీటిలో కలిపి పిచికారీ చేయాలని రైతులకు సూచించారు. 

Advertisement
Advertisement
Advertisement