Abn logo
Sep 30 2020 @ 05:21AM

నవంబరు 2 నుంచి బడి

పాఠశాలల ప్రారంభం మళ్లీ వాయిదా

అక్టోబరు 5న విద్యాకానుక కిట్ల పంపిణీ 


కర్నూలు(ఎడ్యుకేషన్‌), సెప్టెంబరు 29: కొవిడ్‌ సమస్య కొనసాగుతున్న నేపథ్యంలో నవంబరు 2న పాఠశాలలు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి సెప్టెంబరు 5న పునఃప్రారంభించాలని భావించారు. కానీ అక్టోబరు 5కు వాయిదా వేశారు. తాజాగా మరోమారు వాయిదా వేసి నవబంరు 2 నుంచి తరగతులు మొదలౌతాయని ప్రభుత్వం ప్రకటించింది. జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీ మాత్రం అక్టోబరు 5న కొనసాగించాలని నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయాలతో ఈ ఏడాది విద్యాసంవత్సరం ఉంటుందో లేదోనని తల్లిదండ్రులు అయోమయంలో పడ్డారు. 9, 10 తరగతుల విద్యార్థులు పాఠశాలలకు వెళ్లి ఆన్‌లైన్‌ తరగతుల అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చునని ప్రభుత్వం ఇప్పటికే అనుమతించింది. దీనికోసం రోజూ 50 శాతం ఉపాధ్యాయులు బడికి హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చింది. ఏకోపాధ్యాయ పాఠశాలలకు మాత్రం రోజూ హాజరు కావాలని సూచించింది. నాడు-నేడు పనులను పర్యవేక్షించాలని ఉత్తర్వులు జారీ చేసింది. 

Advertisement
Advertisement
Advertisement