Abn logo
Sep 25 2021 @ 01:04AM

సమస్యలపై స్కీమ్‌ వర్కర్ల ధర్నా

మచిలీపట్నంలోని కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న స్కీమ్‌ వర్కర్లు

మచిలీపట్నం టౌన్‌, సెప్టెంబరు 24 : స్కీమ్‌ వర్కర్లను రెగ్యులర్‌ చేయాలని, కనీస వేతనం రూ. 21 వేలు ఇవ్వాలని, ఈఎస్‌ఐ, పీఎఫ్‌, కొవిడ్‌తో చనిపోయినవారికి రూ.50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేస్తూ కలెక్టరేట్‌ వద్ద శుక్రవారం ధర్నాకు దిగారు. స్కీమ్‌ వర్కర్ల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాకు తూర్పుకృష్ణా వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు ఆర్‌. రఘు ప్రారంభించి ప్రసంగించారు. ప్రభుత్వం స్కీమ్‌ వర్కర్ల సేవలను వినియోగించుకుంటున్నప్పటికీ కనీస వేతనం రూ. 21 వేలు ఇవ్వడం లేదన్నారు. సీఐసీయూ నగర కార్యదర్శి బి.సుబ్రహ్మణ్యం,  జయరావు, అంగన్‌వాడీ వర్కర్ల సంఘ నాయకులు సుజాత, రమాదేవి, సిహెచ్‌. నాంచారమ్మ, లక్ష్మి, సీత, అంజలి మాట్లాడారు.