Abn logo
Jul 13 2020 @ 13:32PM

సత్యరాజ్‌, శశికుమార్‌ కాంబినేషన్‌లో ‘ఎంజీఆర్‌ మగన్‌’

గ్రామీణ కథాంశాలతో కమర్షియల్‌ చిత్రాలను అందించిన ప్రముఖ దర్శకుడు పొన్‌రామ్‌ తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఎంజీఆర్‌ మగన్‌’. సీని యర్‌ నటుడు సత్యరాజ్‌, నటుడు,దర్శకుడు శశి కుమార్‌ కాంబినేషన్‌లో ఈ చిత్రం రూపొందుతోంది. శశికుమార్‌కు జోడీగా మృణాళిని రవి నటిస్తోంది. శరణ్యా పొన్‌వణ్ణన్‌, సముద్రకని, సింగంపులి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆంటోని దాసన్‌ సంగీతం అందిస్తున్నారు. స్ర్కీన్‌ సీన్‌ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో రూపొందిస్తోంది. లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

Advertisement
Advertisement
Advertisement