Jul 28 2021 @ 17:47PM

99 మంది వద్దనే అంటారు.. ధైర్యం చెప్పేది ఒక్కడే: సత్యదేవ్

స‌త్య‌దేవ్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘తిమ్మ‌రుసు’. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్, ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్స్‌పై మ‌హేశ్ కోనేరు, సృజ‌న్ ఎర‌బోలు ఈ చిత్రాన్ని నిర్మించారు. శ‌ర‌ణ్ కొప్పి శెట్టి ద‌ర్శ‌కత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం జూలై 30న థియేట‌ర్స్‌లో విడుద‌ల‌కాబోతోంది. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను చిత్రయూనిట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ‘‘సెకండ్ వేవ్ త‌ర్వాత థియేటర్లలోకి మొద‌ట‌గా వ‌స్తున్న మా ‘తిమ్మ‌రుసు’ చిత్రాన్ని ఆద‌రించి స‌పోర్ట్ చేయాల‌ని ప్రేక్ష‌కుల‌కు కోరుకుంటున్నాను’’ అన్నారు హీరో సత్యదేవ్. 


ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఫిల్మ్ ఇండ‌స్ట్రీ అనేది ఒక ఓపెన్ యూనివ‌ర్సిటీ. ఇక్క‌డ క్వాలిఫికేష‌న్స్‌, ఎంట్ర‌న్స్ ఎగ్జామ్స్‌, మార్కులు ఏమీ ఉండ‌వు. ప్యాష‌న్ అనే క్వాలిఫికేష‌న్‌తో రావాలి. 99 మంది మ‌న‌కు ఇండ‌స్ట్రీ గురించి ఎన్నో చెబుతారు. కానీ ఒక‌రు మాత్ర‌మే ఏం కాదు.. ముందుకెళ్లు అని చెబుతాడు. ఆ ఒక‌రెవ‌రో కాదు.. మ‌న‌కు మ‌న‌మే. అలా ఎంతో ధృడ‌మైన న‌మ్మ‌కంతో, ఈ ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకున్న వ్య‌క్తుల్లో మై డియ‌రెస్ట్ నాని అన్న ఒక‌రు. త‌ను ఈ వేడుకకు రావ‌డం వ‌ల్ల‌, మాలాంటి వాళ్ల‌కు ఎంతో ధైర్యం వ‌స్తుంది. నాని అన్నంటే నాకు చాలా చాలా ఇష్టం. నా ఫ‌స్ట్ అఫిషియ‌ల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇది. చాలా సంతోషంగా ఉంది. ఎంటైర్ వ‌రల్డ్‌లో.. కోవిడ్ ఫ‌స్ట్ వేవ్ త‌ర్వాత థియేట‌ర్స్‌లో వ‌చ్చిన సినిమాల‌న్నీ హిట్ కావ‌డం మ‌న తెలుగు ఇండ‌స్ట్రీలోనే సాధ్య‌మైంది. తెలుగు ప్రేక్ష‌కులు మంచి సినిమాను ఎంక‌రేజ్ చేయ‌డంలో ఎప్పుడూ ముందుంటారు. అది చాలా సార్లు ప్రూవ్ అయ్యింది. ఇప్పుడు సెకండ్ వేవ్ త‌ర్వాత మొద‌ట‌గా వ‌స్తున్న సినిమా మా ‘తిమ్మ‌రుసు’. నిర్మాత సృజ‌న్‌, మ‌హేశ్ కాంబినేష‌న్‌లో సినిమా ముంద‌డుగు వేసింది. శ‌ర‌ణ్ కొప్పిశెట్టి, ఎప్పుడూ చాలా కూల్‌గానే క‌న‌ప‌డ‌తాడు. త‌ను తిమ్మ‌రుసును అద్భుతంగా చేశాడు. త‌న‌కి థాంక్స్‌. శ్రీచ‌ర‌ణ్ పాకాల.. ఫాస్టెస్‌, సిన్సియ‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌. ఈ సినిమాకు చాలా చ‌క్క‌గా మ్యూజిక్ అందించాడు. బ్ర‌హ్మాజీగారు మోస్ట్ పాజిటివ్ ప‌ర్స‌న్‌. న‌వ్విస్తూ.. న‌వ్వుతూ ఉండ‌ట‌మే ఆయ‌నలో గ్లోకి కార‌ణం. నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ అప్పూ ప్ర‌భాక‌ర్ ఈ సినిమాకు వ‌ర్క్ చేశారు. కంఫ‌ర్ట్ జోన్ దాటి ఈ సినిమాలో ఫైట్స్ చేశాను. ప్రియాంక మంచి న‌టి, వండ‌ర్‌ఫుల్ హ్యుమ‌న్ బీయింగ్‌. 39 రోజుల్లో సినిమా పూర్త‌య్యింది. సెకండ్ వేవ్‌లో ముందుగా వ‌స్తోన్న ఈ సినిమాను ఆద‌రించి స‌పోర్ట్ చేయాల‌ని ప్రేక్ష‌కుల‌కు కోరుకుంటున్నాను’’ అన్నారు.