Abn logo
Oct 16 2021 @ 19:43PM

జైలు నుంచి విడుదలైన శశికళ మేనల్లుడు

బెంగళూరు: అన్నాడీఎంకే బహుష్కృత నేత వీకే శశికళ మేనల్లుడు వీఎన్ సుధాకరన్ శనివారంనాడు బెంగళూరు పరప్పన అగ్రహార జైలు నుంచి విడుదలయ్యారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో జైలు శిక్ష పూర్తి కావడంతో ఆయన విడుదలకు మార్గం సుగమమైంది. ఇదే కేసులో శశికళతో పాటు సహనిందితులు ఇళవరసి, సుధాకరన్‌లకు కూడా నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. శనివారం మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో ఆయన జైలు నుంచి విడుదలై చెన్నైకు బయలుదేరారు.

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి దివంగత జేజే జయలలిత పెంపుడు కుమారుడుగా సుధాకరన్‌ను చెప్పేవారు. అయితే, ఆ తర్వాత క్రమంలో ఆయన జయలలిత పెంపుడు కొడుకు కాదని ప్రకటించారు. సుధాకరన్ జైలు నుంచి బయటకు వచ్చిన సమయంలోనే చెన్నైలోని దివంగత జయలలిత స్మారకం వద్ద నివాళులర్పించేందుకు శశికళ వెళ్లారు. ఈ ఏడాది జనవరిలో శశికళ విడుదలైన తర్వాత జయలలిత స్మారకాన్ని సందర్శించడం ఇదే మొదటిసారి.

ఇవి కూడా చదవండిImage Caption