Abn logo
Aug 3 2021 @ 23:08PM

సర్పంచ్‌ల చాంబర్‌ ఎవరిది?

 పావులు కదుపుతున్న అధికార పార్టీ

 పట్టు బిగిస్తున్న ప్రతిపక్షాలు

 టీడీపీ, జనసేన కూటమికే ఆధిక్యం 

 (తాడేపల్లిగూడెం–ఆంధ్రజ్యోతి)

 తాడేపల్లిగూడెం రూరల్‌ మండలం పంచాయతీ ఎన్నికల్లో భంగపడ్డ అధికార పార్టీ సర్పంచ్‌ల ఛాంబర్‌ను కైవసం చేసుకోవడానికి పావులు కదుపుతోంది. బలం లేకపోయినా ప్రతిపక్ష పార్టీ మద్దతుదారులను కూడగట్టుకునేందుకు సంప్రదింపులు జరుపుతోంది. అధికార పార్టీ ఎత్తుగడలను పసిగట్టిన ప్రతిపక్షాలు అప్రమత్తమయ్యాయి. సర్పంచ్‌ల ఛాంబర్‌ను కూడా తమ ఖాతాలో వేసుకోవడానికి సర్వసన్నద్ధమవుతు న్నాయి. నియోజకవర్గంలో ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌గా మారింది. తాడేపల్లిగూడెం రూరల్‌ మండలంలో  ఇదివరకు 31 పంచాయతీలు ఉండేవి. అందులో ఎల్‌ అగ్రహారం, కొండ్రుప్రోలు, కుంచనపల్లి, పడాల పంచాయతీలు మునిసిపాలిటీలో విలీనమయ్యాయి. మొత్తం 27 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. అందులో 15 పంచాయతీలు తెలుగుదేశం, జనసేన కూటమి కైవసం చేసుకున్నాయి. రెండు పంచా యతీల్లో రెబల్‌ అభ్యర్థులు గెలుపొందా రు. అధికార వైసీపీ 10 పంచాయతీలకే పరిమితమైంది. అయినా అధికారాన్ని వినియోగించి సర్పంచ్‌ల చాంబర్‌ను తమ ఖాతాలో వేసుకోవడానికి అధి కార పార్టీ ప్రయత్నాలు చేసింది. తెలు గుదేశం సర్పంచ్‌లను సంప్రదించింది. జనసేన మద్దతుదారులపైనా దృష్టి పెట్టింది. ఈ విషయం రెండు పార్టీల నియోజకవర్గ నాయకత్వం దృష్టికి వచ్చింది. దాంతో రెండు పార్టీలు అప్రమత్త మయ్యాయి. తెలుగుదేశం, జనసేన మద్దతుదారులను ఒకే చోట సమావేశప రచి చాంబర్‌ను తమ ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే అధికార వైసీపీ పెంటపాడు చాంబర్‌ను కైవసం చేసుకోవడానికి బుధ వారం సమావేశమవుతోంది. ఆ మండలంలో అధికార పార్టీకి ఆధిక్యత ఉంది. దాంతో పెంటపాడు సర్పంచ్‌ల చాంబర్‌ వైసీపీ  వశం కానుంది. తాడేపల్లిగూ డెం రూరల్‌ మండలంలో మాత్రం అధికార పార్టీకి మళ్లీ చుక్కెదురయ్యే అవకా శాలు అధికంగా కనిపిస్తున్నాయి.