Abn logo
Jul 7 2020 @ 08:58AM

స‌రోజ్‌ఖాన్ జీవితంపై బ‌యోపిక్‌

బాలీవుడ్‌కు చెందిన ప్ర‌ముఖ‌ కొరియోగ్రాఫర్ సరోజ్‌ఖాన్ మ‌న మ‌ధ్య లేరు. ఆమె జీవితంపై బ‌యోపిక్ రూపొంద‌నుంది. ఈ విష‌యాన్ని ఆమె కుమార్తె సుకైనా నాగ్‌పాల్ వెల్ల‌డించారు. దీని గురించి ఆమె మీడియాతో మాట్లాడుతూ త‌న తల్లి సరోజ్‌ఖాన్‌పై బయోపిక్ చేయాలని చాలా మంది అడుగుతున్నార‌ని అన్నారు‌. అయితే ప్ర‌ముఖ కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా తొలుత‌ సరోజ్‌ఖాన్ బయోపిక్ తీసేందుకు త‌న‌ను సంప్ర‌దించార‌ని తెలిపారు. త‌న తల్లికి జాతీయస్థాయి అవార్డులు వ‌చ్చిన‌ప్ప‌టికన్నా, మ‌నుమ‌ల‌తో నృత్యం చేసేట‌ప్పుడే ఎంతో ఆనందించేవారిని తెలిపారు. తాను గ‌తంలో ఒక‌సారి త‌న త‌ల్లితో మీ బ‌యోపిక్ తీయాల‌నుకుంటే ఎవ‌రికి అవ‌కాశం క‌ల్పిస్తార‌ని అడిగాన‌ని, అప్పుడు ఆమె రెమో డిసౌజాకు క‌ల్పిస్తాన‌ని తెలిపార‌న్నారు. రెమో డిసౌజా సున్నా స్థాయి నుంచి పెద్ద ద‌ర్శ‌కునిగా ఎదిగార‌ని త‌న త‌ల్లి చెప్పేవార‌న్నారు. 

Advertisement
Advertisement
Advertisement