Jun 12 2021 @ 08:35AM

సంతోశ్‌, మెహరీన్ మూవీ టైటిల్ ఇదేనా?

సంతోశ్‌ శోభన్‌, మెహరీన్‌ జంటగా ఓ సినిమా తెరకెక్కుతోంది. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం హైద‌రాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో సైలెంట్‌గా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. ల‌వ్ అండ్ కామెడీ అంశాలే ప్ర‌ధానంగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రానికి ‘మంచిరోజులు వచ్చాయి’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు నెట్టింట వార్తలు హల్‌చ‌ల్ చేస్తున్నాయి. కరోనా నేపథ్యంలో త‌గు జాగ్రత్తలు తీసుకుంటూ... నటీనటులు, సాంకేతిక నిపుణులు, ఇతర బృందానికి పరీక్షలు చేయించి షూటింగ్ చేస్తున్నారు. రీసెంట్‌గానే సంతోశ్‌ శోభన్‌ నటించిన ‘ఏక్‌ మినీ కథ’ ఓటీటీలో విడుదలైంది. మరో సినిమా ‘ప్రేమ్‌ కుమార్‌’ ఫస్ట్‌ లుక్‌ విడుదలైంది.