Abn logo
May 9 2021 @ 18:19PM

సీఎం యోగికి కేంద్ర మంత్రి లేఖ

లక్నో : కేంద్ర మంత్రి సంతోశ్ గాంగ్వర్ యూపీ ముఖ్యమంత్రి యోగికి ఓ లేఖ రాశారు. ప్రస్తుతం ఇది వైరల్‌ అయ్యింది. కోవిడ్ రోగులను ఆస్పత్రుల్లో చేర్చుకోవడం లేదని, అధికారులకు ఫోన్ చేస్తే, సమాధానం ఇవ్వడం లేదని సంతోశ్ గాంగ్వర్ ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా కోవిడ్ దృష్ట్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖను చాలా అప్‌డేట్ చేయాల్సిన అవసరం కూడా ఉందని నొక్కి చెప్పారు. రోగుల విషయంలో అధికారులు ఏమాత్రం సరిగ్గా వ్యవహరించడం లేదని, రిఫర్ లెటర్ పేరుతో ఆస్పత్రులకు తిప్పుతున్నారని ఆక్షేపించారు. అంతేకాకుండా ఆక్సిజన్ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని బరేలీ నియోజకవర్గంలో ఓ ఆక్సిజన్ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. కరోనా రోగికి అవసరమైన వెంటిలేటర్లు, బీపప్ పరికరాలతో పాటు మరికొన్ని మెడికల్ పరికరాలను కొందరు బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతున్నారని, పైగా అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఫిర్యాదు చేశారు. వీటిని వెంటనే అదుపు చేయాలని, బ్లాక్ మార్కెట్‌ను కట్టడి చేయాలని గాంగ్వర్ లేఖలో డిమాండ్ చేశారు. 

Advertisement
Advertisement
Advertisement