Abn logo
Jun 3 2020 @ 03:58AM

నోవాటెల్‌లో శానిటైజర్‌ యంత్రం తయారీ

శంషాబాద్‌రూరల్‌: కరోనా-19 వ్యాప్తిని నివారించేందుకు శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలోని నోవాటెల్‌ హోటల్‌ ఇంజనీర్ల బృందం నూతన శానిటైజర్‌ యం త్రాన్ని తయారు చేసింది. చేతితో తాక కుండా కాలితో నొక్కితే శానిటైజర్‌ చేతుల్లో పడే విధంగా ఈ యాంత్రాన్ని రూపొందిం చినట్లు హోటల్‌ జనరల్‌ మేనేజర్‌ శ్రీరుబిన్‌ చెరియన్‌ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్ర్కాప్‌ మెషినరీ నుంచి వీటిని డిజైన్‌ చేశారని తెలిపారు. దీన్ని చీఫ్‌ ఇంజనీర్‌ పి.శ్రీధర్‌ పర్యవేక్షణలో ముకేష్‌, ప్రవీణ్‌, జగదీష్‌, శ్రీకాంత్‌, వాదాల శ్రీధర్‌, సంతోష్‌, అరవింద్‌లు తయారు చేసినట్లు వివరిం చారు. హోటల్‌కు వచ్చే అతిథులు దీనిని వినియోగించుకునేందుకు ఏర్పాటు చేశామని చెప్పారు.

Advertisement
Advertisement