Abn logo
May 18 2020 @ 05:34AM

పది పరీక్షా కేంద్రాల్లో శానిటైజేషన్‌

 మెటీరియల్‌ కొనుగోలుకు ప్రభుత్వం ఆదేశం


తాండూరు: పదో తరగతి పరీక్షల నిర్వహణకు హైకోర్టు అనుమతిస్తే అందుకు సిద్ధంగా ఉండేం దుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కరోనా వ్యాప్తి పరీక్షా కేంద్రాల్లో కావాల్సిన మెటీరియల్‌ కొనుగోలు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. పరీక్షా కేంద్రాల వారీగా విద్యార్థులు, నిర్వహణకు హాజరయ్యే స్టాఫ్‌కు కావాల్సిన మాస్కులు, శానిటైజర్లు, పరీక్ష కేంద్రానికి ఒక్కటి చొప్పున థర్మల్‌ స్కానర్‌, హ్యాండ్‌ గ్లౌజ్‌లు కొనుగోలు చేయాలని జిల్లా విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. బెంచీలు, టేబుల్స్‌, డోర్లు, స్వీచ్‌ బోర్డులను శుభ్రం చేసేందుకు అవసరమయ్యే డిసిఫికేషన్‌ లిక్విడ్‌ను కొనుగోలు చేయనున్నారు.


మెటీరియల్‌ను కొనుగోలును జిల్లా కమిటీ ద్వారా ఆమోదించి కొనుగోలు చేయాలని సూచించారు. నాణ్యమైన వస్తువులు, పరికరాలను కొనుగోలు చేయాలని, విద్యార్థుల సంఖ్య, స్టాఫ్‌ మెంబర్స్‌కు అనుగుణంగా మెటీరియల్‌ కొనుగోలు చేయాలన్నారు. మెటీరియల్‌ను విద్యాశాఖ నిధుల నుంచి కొనుగోలు చేయాలని సూచించారు. జిల్లా నుంచి పంపిన ఎస్టిమేషన్‌ బడ్జెట్‌ మేరకు రాష్ట్ర విద్యా శాఖ నిధులను విడుదల చేస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒక్క శాతం సోడియం హైపోక్లోరైడ్‌ను కూడా కొనుగోలు చేయాలని ఆదేశించారు. మెటీరియల్‌ కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచాలని, హైకోర్టు ఆదేశాలు వెలువడిన వెంటనే పరీక్షల నిర్వహణకు సిద్ధంగా ఉండేలా ప్రణాళికలను రూపొందించుకోవాలని విద్యాశాఖ ఉన్నతాఽ ధికారులు డీఈవోలకు సూచించారు.  

Advertisement
Advertisement